గుడ్ న్యూస్ స్కూళ్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే

గుడ్ న్యూస్ స్కూళ్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే

0
110

ఈ కరోనా వైరస్ తో దేశంలో లాక్ డౌన్ విధించారు, దీంతో మార్చి చివరి వారం నుంచి దేశ వ్యాప్తంగా స్కూల్స్ కూడా తెరచుకోవడం లేదు, అయితే దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు కొన్ని సడలింపులు ఇస్తోంది కేంద్రం, తాజాగా ఈ సమయంలో స్కూళ్లు కూడా ఎప్పుడు తెరుస్తారు అని ప్రతీ ఒక్కరు అడుగుతున్నారు, ఇటు విద్యార్దుల అకడమిక్ ఇయర్ దెబ్బతినకూడదు అని ప్రతీ ఒక్కరు కోరుతున్నారు.

అయితే దీనిపై కేంద్రం ఒకేసారి నిర్ణయం తీసుకోనుంది. స్కూళ్లు ఎప్పుడు ఓపెన్ చేస్తామో చెప్పారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్. ఆగస్ట్ తర్వాతే స్కూళ్లు ఓపెన్ చేస్తామని ఆయన తెలిపారట, అయితే దేశంలో 33 కోట్ల మంది విద్యార్దులు దీని కోసం ఎదురుచూస్తున్నారు.

కేవలం 33 శాతం అటెండెన్స్తో స్కూళ్లు నిర్వహించే అవకాశం ఉంది. అది కూడా 8 కంటే చిన్న తరగతుల వారిని మినహాయించి, ఆ పైన విద్యార్థులకు మాత్రమే స్కూళ్లు నిర్వహించే చాన్స్ ఉంది. పూర్తిగా వైరస్ కేసులు తగ్గిన తర్వాత ప్రైమరీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు..అలాగే రెండు బ్యాచులుగా మార్నింగ్ బ్యాచ్ మధ్యాహ్నంబ్యాచ్ స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు..అలాగే, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే స్కూళ్లను ముందుగా ఓపెన్ చేయనున్నారు అని వార్తలు వస్తున్నాయి.