కరోనా సమయంలో రైల్వే సర్వీసులు పూర్తిగా నడవడం లేదు, దీంతో కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులు మాత్రమే నడస్తున్నాయి, అయితే తాజాగా దశల వారీగా నడుస్తున్న ట్రైన్ల వల్ల కొందరికే ప్రయాణానికి అవకాశం ఉంటోంది.
పైగా కొన్ని స్టేషన్లలో ట్రైన్స్ నిలవడం లేదు, అయితే కొత్త ట్రైన్లు నడపాలి అని ప్రయాణికులు కోరుతున్నారు, తాజాగా దసరా దీపావళి సమయంలో కొత్త రైళ్లు ప్రకటించారు ..మరో 39 రైళ్లు ప్రకటించింది రైల్వేశాఖ.
తాజాగా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైళ్లు సేవలందించనున్నాయి. మరి రైళ్లు ఏమిటి అనేది చూద్దాం..ఈ నెల 13 నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు తెలిపింది.
అక్టోబర్ 13 నుంచి ప్రతి మంగళవారం ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్ – షాలిమార్ రైలు
అక్టోబర్ 14 నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 4.05 గంటలకు షాలిమార్ – సికింద్రాబాద్ రైలు
అక్టోబర్ 14 నుంచి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9.50 గంటలకు తిరుపతి – విశాఖ రైలు
అక్టోబర్ 15 నుంచి ప్రతి గురు, శని, సోమ వారాల్లో రాత్రి 10.25గంటలకు విశాఖ – తిరుపతి రైలు
అక్టోబర్17 నుంచి ప్రతి శనివారం సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్ – విశాఖ రైలు
అక్టోబర్ 18 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు విశాఖ- సికింద్రాబాద్ రైలు
అక్టోబర్26 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 7.55 గంటలకు లింగంపల్లి – కాకినాడ రైలు
అక్టోబర్ 25 నుంచి ప్రతి మంగళ, గురు, ఆదివారాల్లో 8.10 గంటలకు కాకినాడ – లింగంపల్లి రైలు