తెరాసకు ఎర్రబెల్లి గుడ్ బై..త్వరలో ఆ పార్టీలోకి!

0
68

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు తెరాసకు షాక్ ఇచ్చారు. ఆయన తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. 2018 ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యే టికెట్, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించి భంగపడిన ప్రదీప్‌రావు.. అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలిపారు.