ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రతీ కంపెనీ కూడా తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నాయి, దీంతో చాలా వరకూ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, నగరాలు వదిలి పట్టణాలు పల్లెలు వెళ్లిపోయారు.
అయితే ఇంకా కరోనా వైరస్ కు వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. అలాగే కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరికి వ్యాక్సిన్ వస్తుంది అంటున్నారు, ఈ సమయంలో ఉద్యోగులని ఇప్పుడు కంపెనీలకు తీసుకువచ్చే సాహసం చేయడం లేదు.
అంతేకాదు మరికొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించాలి అని చూస్తున్నాయి కంపెనీలు.. ఇప్పటికే ఈ ఏడాది డిసెంబర్ వరకూ అన్నీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అని ఆర్డర్ ఇచ్చాయి, అయితే తాజాగా గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది జులై వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ను పొడిగించింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ లో ఆఫీసులో పని అవసరం లేని వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
మొత్తం వరల్డ్ వైడ్ గూగుల్ ఉద్యోగులు అందరికి ఇదే వర్తిస్తుంది అని తెలుస్తోంది
‘