ఆన్‌లైన్ రుణాలు ఇస్తూ వేధింపులకి పాల్పడుతున్న కొన్ని కంపెనీలపై యాప్స్ పై ఎన్నోకేసులు నమోదు అవుతున్నాయి.. తాజాగా ఇలాంటి వాటిపై గూగుల్ కూడా చర్యలు తీసుకుంది.
పదుల సంఖ్యలో రుణ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది.. రుణాలు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న కంపెనీలకు షాక్ ఇచ్చింది.
ప్లేస్టోర్‌లోని వందలాది దేశీయ రుణయాప్స్‌పై గూగూల్ రివ్యూ చేసింది. వాటికి యూజర్లు ఇచ్చే రివ్యూలు అలాగే సర్కారు హెచ్చరికలు ఇవన్నీ చూసి సుమారు 30 యాప్స డిలీట్ చేసింది..ఆ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది.
లేజీ పే, క్యాష్ గురు, 10మినిట్స్ లోన్, రూపీ క్లిక్, ఫైనాన్స్ బుద్ధవంటి యాప్స్ ఉన్నాయి, ఇటీవల కొన్ని కంపెనీల వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి, వీటిపై చర్యలు తీసుకోవాలి అని చాలామంది కోరారు. సరైన విధంగా రూల్స్ పాటించని వాటిని తొలగిస్తాం అని గూగుల్ కంపెనీ తెలిపింది.