గూగుల్ లో ఎక్కువ‌గా వెతుకుతున్న విష‌యాలు ఇవే

గూగుల్ లో ఎక్కువ‌గా వెతుకుతున్న విష‌యాలు ఇవే

0
135

ప్ర‌పంచం అంతా ఈ క‌రోనాకి భ‌య‌ప‌డుతోంది.. దాదాపు 350 కోట్ల మంది ఇంటి ప‌ట్టున ఉంటున్నారు.. అంత‌లా ఈ వైర‌స్ విజృంభిస్తోంది. ఇక ఉద్యోగులు కూడా చాలా వ‌ర‌కూ వ‌ర్క ఫ్ర‌మ్ హోమ్ మాత్ర‌మే చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో అంద‌రూ స్మార్ట్ ఫోన్లు చేత ప‌ట్టుకుని ఉంటున్నారు.

ఇక గూగుల్ చూసే వారి సంఖ్య బాగా పెరుగుతోంది.. కొత్త విష‌యాలు నేర్చుకునే వారు ఉంటున్నారు.
గూగుల్ లో వెతుకుతున్న అంశాలు చూస్తే, ప్ర‌స్తుతం టాప్ ట్రెండింగ్స్ లో మానసిక ఒత్తిడి, నివారణ విధానాలు, ఉద్యోగ అన్వేషణలు, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టూల్స్, వంటల రెసిపీల కోసం బాగా వెతుకుతున్నట్టు గూగుల్ తెలిపింది.

మ‌న దేశ‌మే కాదు యావ‌త్ ప్ర‌పంచం అంతా వంట‌ల గురించి ఎక్కువ‌గా వెతుకుతున్నార‌ట‌. ఇక మంచి యాక్ష‌న్ గేమ్స్ గురించి త‌ర్వాత సెర్చింగ్ ఎక్కువ ఉంటోంది, అలాగే ఇంప్రెస్ చేసే అంశాల గురించి సెర్చ్ చేస్తున్నార‌ట‌, ఇక త‌ర్వాత పోర్న్ ఎక్కువ‌గా చూస్తున్నార‌ట‌, ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా టూరిస్ట్ హ‌బ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అనే డీటెయిల్స్ వెతుకుతున్నార‌ట‌, ఇక టెన్ లో మాత్రం ఉద్యోగాల కోసం కొత్త‌గా అప్లై చేసుకుంటున్నార‌ట‌.