గూగుల్ పే, ఫోన్పే యూజర్లకు డిసెంబర్ చివరి నుంచి షాక్ కొత్త రూల్స్

గూగుల్ పే, ఫోన్పే యూజర్లకు డిసెంబర్ చివరి నుంచి షాక్ కొత్త రూల్స్

0
99

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా సరికొత్త రూల్స్ తీసుకువస్తోంది, దీని వల్ల కంపెనీలకు అలాగే యూజర్లపై కూడా ప్రభావం పడుతుంది..యూపీఐ ట్రాన్సాక్షన్స్ విషయంలో పరిమితిని విధించబోతున్నారు. మీరు ఇక ఒకే యాప్ ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరపడానికి వీలు ఉండదు.

ఒక యాప్ ద్వారా గరిష్టంగా 30 శాతం వరకు మాత్రమే లావాదేవీల పరిమితిని విధిస్తోంది. గూగుల్ పే లేదా ఫోన్పే, వాట్సాప్ పే, పేటీయం, మొబిక్వీక్ ఇలా అన్నింటిని ఇక వాడాల్సిందే.

యూపీఐ ఎకోసిస్టమ్ను కాపాడటంతో పాటు ఒకే యూపీఐ యాప్ మార్కెట్ లీడర్గా మారకుండా అడ్డుకోవడం ఈ కొత్త రూల్స్ ఉద్దేశం. ఈ కొత్త రూల్స్ 2021 జనవరి 1న అమలులోకి రానున్నాయి. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్ పే గూగుల్ పే ఎక్కువ వాడుతున్నారు, సో లిమిట్ పెడితే అన్నీ కంపెనీల యాప్స్ వాడతారు ట్రాన్సాక్షన్ ఫినిష్ అయ్యాక కొత్త లావాదేవీ వేరే వాటి నుంచి కూడా చేస్తారు.

భారతదేశంలో 21 థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ ఉన్నాయి. దేశంలో లావాదేవీల్లో 80 శాతం లావాదేవీలు ఫోన్పే, గూగుల్ పే ద్వారానే జరుగుతాయి.సో ఇక ఈ రూల్ రానుంది, అయితే ఎలాంటి నిబంధనలు ఉంటాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది
రోజూ 5 లావాదేవీలు మాత్రమే అనే లిమిట్ పెట్టొచ్చు అని నిపుణులు అంటున్నారు, లేదా 1000 కంటే తక్కువ లావాదేవీలకు ఓ రూల్ ఉండవచ్చు అంటున్నారు.