రాయలసీమ యాసతో స్పీచ్ అదరగొట్టిన గోరంట్ల మాధవ్

రాయలసీమ యాసతో స్పీచ్ అదరగొట్టిన గోరంట్ల మాధవ్

0
82

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ యాసతో అదరగొట్టారు… చాలా రోజుల తర్వాత తమ ప్రాంతానికి న్యాయం జరుగుతోందని మాధవ్ అన్నారు…

రాయలసీమ వాసులు ఎప్పుడు గొర్రెలు కాసుకోవడానికే పరిమితం కావాలా అని ప్రశ్నించారు… మూడు రాజధానుల ద్వారా రాయలసీమకు న్యాయం జరుగుతుందని అన్నారు… అంతేకాదు టీడీపీ నేతలు రాజధాని విషయంలో ఢిల్లీకి వచ్చి చూసుకుంటామనంటే అక్కడే సిద్దం అని అన్నారు…

ఇటీవలే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిమీద జరిగిన దాడిపై కూడా ఆయన స్పందించారు… ఈ దాడి రాజధాని రైతులు చేసిన దాడి కాదని రైతుల ముసుగులో వచ్చి టీడీపీ కార్యకర్తలే దాడి చేశారని మాధవ్ ఆరోపించారు… మూడు రాజధానుల ద్వారా సీమకు న్యాయం జరుగుతుందని దీన్ని టీడీపీ నాయకులు అడ్డుకోవడం దారుణం అని అన్నారు….