ఏనుగులని చంపేస్తున్న ప్రభుత్వం ….కారణం వింటే షాక్

ఏనుగులని చంపేస్తున్న ప్రభుత్వం ....కారణం వింటే షాక్

0
73

ఈ మధ్య చాలా వరకూ మూగజీవాలని బలితీసుకుంటున్నారు.. తాజాగా ఆస్ట్రేలియాలో మానవ తప్పిదం కొన్ని కోట్ల జంతువులు బలి అవ్వడానికి కారణం అయింది , ఇలా అడవులు తగలపడిపోవడమే కాదు పలు కారణాలు ఉంటున్నాయి, ఈ కారణాలతో మూగజీవాలు బలిపీఠం ఎక్కుతున్నాయి.. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కొన్ని కోట్ల జంతువులని అడవుల్లో బుగ్గిపాలు చేసింది.

తాజాగా నీటి కొరతకు ఒంటెలే కారణమవుతున్నాయన్న సాకుతో వాటిని చంపేందుకు ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిచ్చింది. తాజాగా దక్షిణాఫ్రికాలోని బోట్సవానా ప్రభుత్వం అటువంటి మార్గాన్నే ఎంచుకుంది. కాని ఇక్కడ ఒంటెలు కాదు గజరాజులని చంపాలి అని ఆర్డర్ ఇచ్చారు, ఇలా ఎందుకు ఏనుగులు చంపుతున్నారో తెలుసా.

దక్షిణాఫ్రికాలోని బోట్సవానాలో ఏనుగుల సంఖ్య అధికంగా ఉంది. ఆహారం కొరత కారణంగా ఇవి పంటపొలాలు, ఊళ్లపై పడుతున్నాయి. రైతులు కష్టపడి పండిస్తున్న పంటలు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నాయి. అందుకే ఇక్కడ ప్రభుత్వాన్ని రైతులు కాపాడాలి అని కోరారు ..దీంతో వాటిని చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నారు.. వేటగాళ్లు సుమారు 100 ఏనుగులు చంపడానికి సిద్దం అయ్యారు… దీని కోసం వేలం కూడా నిర్వహించారు అధికారులు, అయితే వీటిని దూరంగా ఉన్న అడవుల్లో వదిలేయాలని ఇలా చంపకూడదు అని జంతు ప్రేమికులు కోరుతున్నారు.