భీమ్లా నాయక్‌ చిత్రానికి ప్రభుత్వం బంపరాఫర్

Government bumper for Bhimla Nayak movie

0
89

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, హీరో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్‌. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తారీఖున థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

తాజాగా భీమ్లానాయక్ చిత్రానికి తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. రెండు వారాల పాటు ఐదవ షోకి అనుమతి ఇస్తున్నట్లుగా ప్రత్యేక జీవోని బుధవారం విడుదల చేసింది. దీంతో చిత్రయూనిట్ మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ చిత్రంపై కక్షపూరిత వాతావరణమే కనబడుతుంది.

ఏపీలోని కొన్ని జిల్లాలలో ‘భీమ్లా నాయక్‌’ ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో అధికారులు భేటీ నిర్వహించడమే కాకుండా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏపీలో మాత్రం ఇప్పటివరకూ ఐదో ఆటకు పర్మిషన్ లేదు.. ఈరోజు రేపటిలో టికెట్ రేట్ల ఇష్యూతో పాటు..ఐదో ఆట అనుమతిపై జీవో వస్తుందని భీమ్లా నాయర్ చిత్ర యూనిట్‌తో పాటు పవన్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.