బ్రేకింగ్ – ఏకంగా 2,479 రైనో కొమ్ములను తగులబెట్టిన అసోం సర్కారు- ఎందుకో తెలుసా

Government of Assam burns 2,479 rhino horns

0
73

సంతోషంగా ఆనందంగా అడవిలో ఉండే జంతువులని వేటగాళ్లు చంపేస్తూ ఉంటారు. వాటి చర్మం గోర్లు కొమ్ములు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అవయవాలు దోచేసి డబ్బు చేసుకుంటారు. అయితే కొందరు దీని నుంచి మెడిసన్స్ తయారు చేస్తారు అని నమ్మి వేటగాళ్లు ఏకంగా వాటి ప్రాణాలు తీస్తారు. ఇలా చాలా జంతువుల వేటగాళ్ల‌ ఉచ్చుల్లో పడి చనిపోతున్నాయి. వరల్డ్ రైనో డేను పురస్కరించుకుని అసోం ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది.

ఈ రోజు 2,479 రైనో కొమ్ములను తగులబెట్టింది. ఇదేంటి ఇలా తగల‌పెట్టడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? మరణించిన రైనోల కొమ్ములను పోగుచేసి ఇవాళ గోళాఘాట్లో ఒకేసారి వాటిని తగులబెట్టారు. దీని వెనుక ఓ గొప్ప ఉద్దేశం ఉంది మరి అది తెలుసుకుందాం.

వేటగాళ్లు వీటిని వేటాడుతున్నారు. ఎందుకంటే వీటి కొమ్ములు ఔషదాల తయారీకి ఉపయోగపడ‌తాయి అని ప్రచారం జరిగింది. దీంతో వాటిని ఈ విధంగా హింసించి చంపేస్తున్నారు. కానీ వీటి కొమ్ముల నుంచి ఎలాంటి మెడిసన్ తయారు చేయడం లేదు. ఇది తెలియచేయడానికి ఈ విధంగా ప్రభుత్వం రైనోలను సంరక్షించుకునే సంకల్పంతో ఇలా చేసింది, దీని వల్ల అయినా వేటగాళ్లల్లో మార్పు రావాలి అని ఆశిస్తున్నారు.