ఎంసెట్ పరీక్ష నిర్వహణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

0
110

ఏపీ విద్యార్థుల ఎంసెట్ పరీక్ష నిర్వహణపై జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం  ఇంటర్‌ మార్కులు ఆధారంగా ఎంసెట్‌ పరీక్షకు 25 శాతం వెయిటేజ్‌ ఇస్తున్న విషయం తెలిసిందే. ఎంసెట్‌ మార్కులకు 75%, ఇంటర్‌ మార్కులకు 25% వెయిటేజీతో మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చేవారు.

కానీ ఈసారి కరోనా కారణంగా క్లాసులు ఆలస్యంగా జరగడంతో.. పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు జరగకుండా ఇచ్చిన మార్కులు విద్యార్థుల వాస్తవ ప్రతిభను ప్రతిబింబించకపోవచ్చనే ఉద్దేశ్యంతో ఇంటర్‌ వెయిటేజీ తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఇది ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు సిద్ధమయ్యే అందరూ విద్యార్థులకు వర్తిస్తుందని ఉన్నత విద్య మండలి వెల్లడించింది.