గవర్నర్ సమావేశాలను ప్రారంభించాలని ఎక్కడా లేదు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

0
96

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని పెట్టకపోవడంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ప్రోరోగ్ కాకపోవడంతోనే గవర్నర్ ప్రసంగాన్ని పెట్టలేదని అన్నారు. గత అసెంబ్లీ సమావేశాలకు ఇది కొనసాగింపు సమావేశాలే అని స్పష్టత ఇచ్చారు.

రాజ్యంగం గురించి బీజేపీకి అవగాహన లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రోరోగ్ కానీ సభకు గవర్నర్ ని పిలిస్తే తప్పు అని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వం అయిన తాము చేసిన డెవలప్మెంట్ గురించి గవర్నర్ చేత చెప్పించుకోవాలని అనుకుంటుందని.. ఆ అవకాశాన్ని ఎవరూ పోగొట్టుకోరని ఆయన అన్నారు. సాంకేతిక సమస్యల వల్లే గవర్నర్ ప్రసంగం ఉండటం లేదని అన్నారు. గతంలోనూ గవర్నర్ ప్రసంగాలు లేకుండా సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. 1970,2013 లలో కూడా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదు. 2004 లో కేంద్ర బడ్జెట్ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించలేదు.
దీనిపై ఇప్పటి కేంద్ర మంత్రి రాం దాస్ అతవాలే 2010 లో సుప్రీం కోర్టు లో పిటీషన్ వేస్తే ధర్మాసనం కొట్టివేసింది. గవర్నర్ ను ప్రొరోగ్ కానీ సమావేశాలకు పిలిస్తే తప్పవుతుంది. కొందరు తెలివి లేని జ్ఞానం లేని వాళ్లే గవర్నర్ ప్రసంగం పై వివాదం సృష్టిస్తున్నారు.

కేసీఆర్ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారు. రాజా సింగ్,సోయం బాపు రావు లు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు ఒళ్ళు, నాలుక రెండు దగ్గర పెట్టుకోవాలి. బండి సంజయ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాజ్యాంగ ఉల్లంఘనలు చేసింది బీజేపీనే అని విమర్శించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. పలు రాష్ట్రాల్లో మీకు మెజారిటీ రాకున్నా.. ఎమ్మెల్యేలను లోబరుచుకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర మీదని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో దొంగతనంగా బీజేపీ పార్టీ రాత్రి పూట ప్రమాణ స్వీకారం చేయించుకున్నారని..గోవా, కర్ణాటకలో కూడా బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు.