కష్టపడి పని చేస్తే అందులో ప్రతిఫలం వస్తుంది, మన కష్టం బట్టీ మన రాబడి ఉంటుంది, ఇలా తన కష్టాన్ని నమ్ముకుని ఇష్టపడి పనిచేస్తే అందులోనే విజయం సాధించవచ్చని నిరూపించింది గుజరాత్ కు చెందిన ఓ మహిళ.
పాలు అమ్మి ఏకంగా కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదించింది. బానాస్కాంత జిల్లాలో నాగానా గ్రామానికి చెందిన నావల్ బెన్ ఆమె వయసు 62 ఏళ్లు, ఇంట్లో ఇలా పశువులు పెంచి వాటి పాలతో వ్యాపారం చేసింది. ఇలా కోటి రూపాయల ఆదాయాన్ని సంపాదించింది.
2020 ఏడాదిలో నెలకు రూ.3.50 లక్షలు లాభాన్ని ఆర్జించింది.. నలుగురు పిల్లల తల్లి అయిన ఆమె 2019లో రూ.87.95 లక్షలు సంపాదించింది. మరో 15 మందికి ఉపాధి కల్పించింది.
మొత్తం 80 గేదేలు, 45 ఆవులతో డైరీని ప్రారంభించి విజయం సాధించింది.2019లో రూ.87.95 లక్షలు సంపాదించిందట. ఆమెని చూసి యువత కూడా అభినందిస్తున్నారు.