గ్రేటర్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న జనసేన కారణం ఇదేనా

గ్రేటర్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న జనసేన కారణం ఇదేనా

0
94

గ్రేటర్ ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది అని అభిమానులు భావించారు.. కొన్నిచోట్ల అయినా కచ్చితంగా జనసేన నుంచి గెలుపొందుతారు అని భావించారు, అయితే అనూహ్యాంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని ప్రకటించారు, దీంతో పవన్ అభిమానులు గ్రేటర్ అలాగే తెలంగాణ జనసేన నేతలు షాక్ అయ్యారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ కేడర్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఇద్దరూ పవన్ ఇంటికి వెళ్లి కలిశారు. పార్టీ నేతలు చర్చించుకున్నారు, అయితే ప్రస్తుతం జనసేన బీజేపీ రెండూ కలిసి పనిచేస్తున్నాయి.

ఇక్కడ మళ్లీ ఇద్దరూ విడిగా పోటీ చేయడం వల్ల పార్టీలపై ఇది ప్రభావం చూపిస్తుంది అని భావించారు. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పని చేస్తాయి పోటీ చేస్తాయి అని తెలిపారు..అయితే ఇలాంటి నిర్ణయం వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉంది అంటున్నారు విశ్లేషకులు, చాలా వరకూ ఇప్పుడు టీర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోంది. ఈ సమయంలో జనసేనని కలుపుకుని వెళితే వారి ఓట్లు కూడా మనకు ప్లస్ అవుతాయి అని భావించి పవన్ తో చర్చించారట.