న్యూ ఇయర్ వేడుకలకు గ్రీన్ సిగ్నల్..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

0
88

మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం వేడుకలకు ప్రత్యేక అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో డిసెంబర్ 31న మద్యం షాపులు, బార్లు, స్పెషల్‌ ఈవెంట్లకు అనుమతి ఇచ్చింది.

డిసెంబర్ 31న మద్యం దుకాణాలకు రాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచొచ్చని తెలిపింది. అలాగే బార్స్‌, ఈవెంట్స్‌, పబ్‌లకు అర్దరాత్రి ఒంటిగంటకు వరకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది.

అయితే ఒమిక్రాన్‌ కట్టడిలో భాగంగా జనవరి 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కానీ న్యూ ఇయర్ వేడుకలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్త్తర్వులు జారీ చేయడం గమనార్హం.