ఎంఎంటీఎస్ రైళ్ల పునః ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ – ఆ రోజు నుండే రైళ్లు షురూ

Green signal for resumption of MMTS trains

0
140

కరోనా విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో ఎంఎంటీఎస్ రైళ్లు ఆగిపోయి చాలా కాలం అయింది.  హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రారంభం అయినప్పటికి, ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రం నడపడం లేదు.అయితే ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంఎంటీఎస్ రైళు ప్రయాణికులకు ఇది తీపి కబురే .

వచ్చే వారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పునః ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ  మేరకు కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నగరంలోని దిగువ, మధ్యతరగతి ప్రజలకు, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ఇతరులకు ఎంఎంటీఎస్‌తో ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. అయితే కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ, తిరిగి సర్వీసులను పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

ప్రజలందరూ కరోనా నియమాలను పాటించాలని, మాస్క్ ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తు, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎంఎంటీఎస్ సేవలను వాడుకోవాలని కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఎంఎంటీఎస్ సర్వీసుల పునరుద్ధరణకు అంగీకరించిన కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్‌కు మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి పీయూశ్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాతే ఈ ప్రకటన వెలువడింది.