మన దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత కొన్ని వస్తువల ధరలు రేట్లు పెరిగాయి.. మరికొన్ని ధరలు తగ్గుముఖం పట్టాయి.. అయితే రేట్ల స్లాబుల ప్రకారం టాక్సులు చూసుకుంటే ఇంపోర్టెడ్ అలాగే లగ్జరీ వస్తువులకు భారీగానే ఉంటోంది జీఎస్టీ.
ప్రస్తుతమున్న 5, 12, 18 శాతం శ్లాబ్ ల స్థానంలో 10, 20 శాతం శ్లాబ్స్ తీసుకు రావాలని అధికారుల కమిటీ కేంద్రానికి కీలక సూచనలు చేసింది. విలాస వస్తువులకు పన్నులను మరింతగా పెంచాలని సిఫార్సు చేసింది. కాస్మెటి క్స్ గ్యాంబ్లింగ్, రిక్రియేషనల్ సేవలపై సెస్ విధించాలని సూచించింది.
అలాగే లగ్జరీ బస్సులు విమానాలు రైళ్ల ప్రయాణంలో సేవలకు కూడా స్లాబులు మారనున్నాయి. అలాగే లగ్జరీ ఫుడ్ అలాగే క్లాత్స్ కు మరింత ట్యాక్స్ లు వేయనున్నారు.. వీటి ధరలు కూడా దాదాపు 15 శాతం పెరిగే అవకాశం ఉంది, అలాగే ఖరీదైన మొబైల్స్ మరింత ప్రియం కానున్నాయి.