గుడివాడలో కొడాలి నానికి తిరుగులేదు అనేది తెలిసిందే.. అయితే తెలుగుదేశం పార్టీ తరపున ఈ ఎన్నికల్లో రావిని పక్కనపెట్టి దేవినేని అవినాష్ ని తీసుకువచ్చారు బాబు.. అయితే దేవినేని కూడా వైసీపీలో చేరడంతో అక్కడ కొడాలి నానికి రాజకీయంగా మరొకరు ఎదురు లేరని చెప్పాలి. అక్కడ టీడీపీ కేడర్ కూడా ఒక్కొక్కరుగా వైసీపీలో చేరుతున్నారు. సీనియర్ నేతలు మాత్రం గుడివాడపై ఆశలు వదులుకోవాలి అంటున్నారు. పైగా జనసేన కూడా అక్కడ అంత యాక్టీవ్ గా లేదు. దీంతో జిల్లాలో వన్ సైడ్ సెగ్మెంట్ అంటే ఇఫ్పుడు గుడివాడ అని చెబుతున్నారు పార్టీ నేతలు.
చంద్రబాబు కూడా ఇక అక్కడ ద్వితీయ స్ధాయి నేతని ఎంచుకుని పార్టీ బాధ్యతలు ఇవ్వాలి అని చూస్తున్నారు..స్ధానికుడు కాకుండా వేరేవారికి ఇస్తే అక్కడ పార్టీ పరిస్దితి దారుణంగా ఉంటుంది అని భావించారట. అయితే దేవినేని అవినాష్ దారుణంగా మనల్ని మోసం చేశాడు అని బాబు బాధపడుతున్నారట. యువ నేత అని పదవి ఇస్తే తాము విలువ ఇవ్వలేదు అని విమర్శలు చేశాడు అని బాబు మండిపడుతున్నారట. మొత్తానికి గుడివాడ గడ్డ కొడాలి నానికి అడ్డాగా మారిపోతుందని, వచ్చే ఎన్నికల్లో కూడా నానికి సరైన నేతని ఇప్పటి నుంచే తయారు చేయాలి అని టీడీపీ భావిస్తోందట.