జగన్ గుప్పెట్లో మరో జిల్లా

జగన్ గుప్పెట్లో మరో జిల్లా

0
94

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మరో జిల్లా ఆయన గుప్పెట్లో చేరిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… పార్టీ ఆవిర్భవం నాటి నుంచి గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోటగా వ్యవహరిస్తోంది…

కాని జగన్ పరిపాలన మార్క్ తో ఈ జిల్లా ఆయన గుప్పెట్లోకి వచ్చేసిందని అంటున్నారు… ఈ ఎన్నికల్లో ఓటమి చెందిన జిల్లా టీడీపీ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు… ఇటీవలే మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యతో సైకిల్ పార్టీ మరింత క్షిణించిందని అంటున్నారు…

శివప్రసాద్ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉండేది… ఆయన కనుసన్నల్లో జిల్లా టీడీపీ నేతలు నడిచేవారు… ఆయన అకాల మరణంతో జిల్లాలో టీడీపీ చిందర బందరం అయింది… ముఖ్యంగా సత్తెన పల్లి నరసారావుపేటలో పార్టీ పరిస్థితి చెప్పనవసరం లేదని రాజకీయ మేధావులు అంటున్నారు…