గుంటూరులో మాజీ టీడీపీ ఎంపీ కూడా జంప్ కు రెడీనటగా

గుంటూరులో మాజీ టీడీపీ ఎంపీ కూడా జంప్ కు రెడీనటగా

0
66

గుంటూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది… ఎక్కువగా రాజధాని ప్రాంతం అయిన గుంటూరు కృష్ణా జిల్లా నుంచి టీడీపీ అధిష్టానానికి షాకులు కొద్దికాలంగా తగులుతున్నాయి…

మొన్న వల్లభనేని వంశీ నిన్న మద్దాలి గిరి రేపో మాపో మాజీ ఎంపీ రాయపాటికి కూడా పార్టీ మరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారట… ఇటీవలే ఆయనకు చెందిన ట్రాన్స్ ట్రయ్ కంపెనీలపై తనిఖీలు నిర్వహించారు సీబీఐ అధికారులు… దీంతో ఆయన తన రాజకీయ దృష్ట్య టీడీపీకి గుడ్ బై చెప్పానున్నారని వార్తలు వస్తున్నాయి…

ఈ వార్తలపై ఆయన స్పందంచారు… ఈ కేసులకు తనకు ఎలాంటి సంబంధంలేదని అన్నారు… సీబీఐ అధికారులు వచ్చినప్పుడు తాను కంపెనీలో లేనని అన్నారు…. కంపెనీ వ్యవహారాలు సీఈవో చూసుకుంటారని తెలిపారు ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదని రానున్న రోజుల్లో ఉండొచ్చు అని తెలిపారు రాయపాటి…