ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం

ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం

0
73

తెరాస నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ తన చాంబర్లో సుఖేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు. యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఖాళీ అయిన స్థానానికి ఎమ్మెల్యే కోటా గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పలువురు తెరాస నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ సందర్భంగా గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని అన్నారు.