హడావుడి బ్యాచ్ మనకు వద్దు జగన్ కీలక నిర్ణయం

హడావుడి బ్యాచ్ మనకు వద్దు జగన్ కీలక నిర్ణయం

0
83

వైసీపీ అధికారంలోకి రావడంతో పక్క పార్టీల నేతల చూపులు అన్నీ వైసీపీ వైపు ఉన్నాయి.. పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు జగన్ పెద్ద పీట వేస్తున్నా కొందరు జూనియర్లు పక్క పార్టీ లనుంచి వైసీపీలోకి రావాలి అని చూస్తున్నారు.. అయితే ఈ నక్క తెలివితేటలు కలిగిన నేతల గురించి ముందుగానే పసిగట్టిన కొందరు వైసీపీ నేతలు, అసలు వారి రాక గురించి సీఎం జగన్ కు చెప్పడం లేదు, ఇలాంటి నేతలని పార్టీలోకి తీసుకోవడానికి సీఎం జగన్ కు ఇష్టం లేదట.

ఈ మధ్య ఓటమి చెందిన పార్టీలో ఓ హడావుడి నేత వైసీపీలోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారట.. అయితే ఆయనని పార్టీలో చేర్చుకోవడానికి మాత్రం జగన్ ఇష్టం చూపించడం లేదట .. పదవి వద్దు పార్టీ తరపున వాయిస్ వినిపిస్తా అన్నారట, అసలు మాకు వద్దు బాబు అంటూ వైసీపీ అతనికి తేల్చి చెప్పిందట.

ఇలాంటి హడావుడి బ్యాచ్ రాజకీయ నేతలు వద్దు అని అంటున్నారట సీఎం జగన్.. ఆ పార్టీలో ఉన్నంత సేపు అక్కడ డప్పు కొట్టి మన దగ్గర అధికారం ఉంది అని ఇక్కడకు వచ్చి తీన్మార్ కొడతామంటే మనం ఎలా తీసుకుంటాం అని సీనియర్లతో చెప్పారట.. అందుకే జగన్ డెసిషన్ ని అందరూ గుడ్ డెసిషన్ అంటున్నారు.