ఈ వైరస్ లాక్ డౌన్ వేళ చాలా వరకూ రెస్టారెంట్లు మాల్స్ మూసివేశారు, దీంతో ఎక్కడా ఏమీ ఓపెన్ కావడం లేదు.. ఇటు ఆతిధ్య రంగం హోటల్ రంగం దారుణంగా పడిపోయాయి, వ్యాపారాలు లేక వేల కోట్ల వ్యాపారాలు ఆగిపోయాయి, లక్షలాది హోటల్స్ రెస్టారెంట్లు ఖాళీగా ఉన్నాయి.
చాలా మందికి ఉపాధి లేదు, అందుకే తెరిచినవి కూడా పార్శిల్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఈ సమయంలో ఆఫర్లు భారీగా ఇస్తున్నాయి రెస్టారెంట్లు.బ్రిటన్ ప్రభుత్వం ప్రజలను బయటి ఫుడ్కు అలవాటు చేసే విధంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది.
హోటల్స్ తెరిచినా ప్రజల నుంచి పెద్దగా ఆధరణ లేకపోవడంతో ఇక్కడ హోటల్ యజమానులు అల్లాడిపోతున్నారు. దీంతో బ్రిటన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ హోటల్స్లో భోజనం చేసినా కేవలం 50 శాతం మాత్రం బిల్లు చెల్లించాలని ఆఫర్ ఇచ్చింది.సోమవారం నుంచి బుధవారం వరకు మాత్రమే ఉంటుంది. ఆఫర్, అలాగే ఆగస్టు నెల మొత్తం ఈ ఆఫర్ ఉంటుందని బ్రిటన్ ఛాన్సలర్ చెప్పారు. అయితే గతంలో కంటే ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది అని భావిస్తున్నారు రెస్టారెంట్ యజమానులు.