న్యూ ఇయర్ వేళ ఆ ఉద్యోగులకు తీపి కబురు..పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణనలోకి..!

Happy New Year to those employees..considered as permanent employees ..!

0
85

టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరువాత మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్బంగా 12 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఈరోజు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.

అలాగే కొత్త సంవత్సరం తొలి రోజున మరో తీపి కబురు చెప్పింది టీఎస్ ఆర్టీసీ.  ఎన్నో ఏళ్లుగా ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తోన్న వారిని రానున్న రోజుల్లో పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని సజ్జనార్ ప్రకటించారు. ఈ కబురు నిజంగా ఉద్యోగులకు ఎంతో మేలు చేయనుంది.

ఏ సందర్బంగా సజ్జనార్ మాట్లాడుతూ..‘సంస్థ అభివృద్ధి చెందితే.. మనందరం బాగుపడతాం. టీఎస్ఆర్టీసీ ఏ ఒక్కరిది కాదు.. మనందరిదీ. ఇందులో ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఉన్నన్ని రోజులు సంస్థ అభివృద్ధి కోసం కృషి చేయాలి’ అని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఏడాది పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చివరిగా రాష్ట్ర ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.