మనం ATM కి వెళ్లిన సమయంలో ఒక్కోసారి నగదు విత్ డ్రా చేసినా నగదు కట్ అయినట్లు మొ బైల్ కు మెసేజ్ వస్తుంది.. కాని నగదురాదు, అయితే ఏదైనా సాంకేతిక సమస్యల వల్ల ఇలా జరుగుతుంది అని చెబుతున్నారు నిపుణులు, అయితే మరి ఆ నగదు రాలేదు కాబట్టి మనం ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ముందు మీరు బ్యాంకుకు వెళ్లి కంప్లైంట్ చేయాలి.
లావాదేవీలు వైఫల్యం (ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్) చెందినపుడు సొమ్మును బ్యాంకులు ఖాతాదారుడికి రివర్ట్ చెస్తాయి. ఇలా చెల్లింపులు ఆలస్యం అయితే అదనపు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది, ఈ విషయం ఆర్బీఐ ట్వీట్ చేసింది.
ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే బ్యాంకులే ఆ సొమ్మును నిర్దిష్ట కాలపరిమితిలో చెల్లిస్తాయి. కార్డు జారీచేసే బ్యాంకు లేదా ఏటీఎం యజమాని ఈ అంశంలో ఫిర్యాదు చేయడం మర్చిపోవద్దు, ఇలా మీ లావాదేవీ జరిగిన ఐదు రోజుల్లో మీకు నగదు డిపాజిట్ చేస్తారు, ఇలా క్రెడిట్ కాకపోతే రోజు రూ.100లు చొప్పున పరిహారం చెల్లించాలి. అయినా మీకు న్యాయం జరగకపోతే బ్యాంకు అంబుడ్స్ మన్ సహాయం తీసుకోవచ్చు.