తాలిబన్లు విధించే శిక్షలు వింటే వన్నులో వణుకు పుడుతుంది – మహిళలపై ఎలాంటి ఆంక్షలంటే

Hearing the punishments imposed by the Taliban makes one tremble

0
93

ఆఫ్ఘనిస్తాన్లోని దాదాపు ప్రతి భాగాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు, ఇక్కడ చాలా మంది ఈ దేశం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోతున్నారు. ఆస్తులు వదులుకుని వెళ్లిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్దితి తమ పిల్లల భవిష్యత్తు కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అయితే వీరు విధించే శిక్షలు కఠిన ఆంక్షలు తెలిస్తే నిజంగా వెన్నులో వణుకు పుడుతుంది. ఎవరైనా పాటించమని ఎదురుతిరిగితే అందరి ముందు చంపేస్తారు.

తాలిబాన్ నిబంధనల ప్రకారం మహిళలు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రాకూడదు. వారి రక్తసంబంధీకుడు కచ్చితంగా పక్కన ఉండాలి. కొడుకు లేదా, అన్న, తమ్ముడు, భర్త లేదా తండ్రి ఎవరో ఒకరు ఉండాలి. ఇక్కడ మహిళలు హైహిల్స్ వాడకూడదు. బహిరంగ ప్రదేశంలో మహిళలు పెద్దగా మాట్లాడలేరు. అజ్ఞాత వ్యక్తి స్త్రీ స్వరాన్ని వినకూడదు. అందుకే వారు మాట్లాడకూడదు రాజకీయాల్లో పాల్గొనకూడదు.

ఒక మహిళ ఇంటి కింది అంతస్తులో లేదా మొదటి అంతస్తులో నివసిస్తుంటే ఆమె ఇంటి కిటికీకి పెయింట్ వేయబడి ఉంటాయి.
లోపల ఎవరు ఉన్నా కనిపించకూడదు. ఈ నియమం ఇంట్లో అందరూ పాటించాలి .ఎనిమిది సంవత్సరాల వయస్సు తర్వాత మహిళలు చదువుకోవడానికి అనుమతించబడరు. అప్పటి వరకూ మాత్రమే స్కూల్ చదువు ఉంటుంది ఇంటి పని చేసుకోవాలి.

మహిళలు వీడియోలు, సినిమాలు చేయకూడదు అలాగే వార్తపత్రికలు, పుస్తకాలు కూడా ఇళ్లలో ఉండకూడదు. ఇక్కడ భర్తలు తమ భార్యల ఫోటోలు వీడియోలు తీయకూడదు.మహిళలు రేడియో లేదా టీవీలలో పనిచేయకూడదు. ఆమె ఏ బహిరంగ సమావేశానికి హాజరుకాలేదు. బండి కారు నడపకూడదు. ఇంటి బాల్కానీలో నిలబడి స్వచ్చమైన గాలి పీల్చకూడదు. కేవలం నాలుగు గోడల మధ్య ఇంటిలోనే ఉండాలి.