హీట్ పెంచుతున్న ఏపీ పాలిటిక్స్

హీట్ పెంచుతున్న ఏపీ పాలిటిక్స్

0
99

స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌‌ఈసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్‌తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీఅయ్యారు ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులపై గవర్నర్‌కు ఎన్నికల కమిషనర్ వివరించారని సమాచారం..

అయితే దీపావళి పండుగ ముందు రోజు గవర్నర్‌తో భేటీ అయిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అప్పట్లో గవర్నర్‌కు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.