Flash News- హెలికాప్టర్ ప్రమాదం..బిపిన్ రావత్ పరిస్థితి విషమం!

0
72

తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ హెలికాప్టర్ లో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన కుటుంబసభ్యులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మొత్తం 14 మంది చాపర్ లో ఉన్నటు తెలుస్తోంది.

వీరిలో ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయినట్టు సమాచారం. వీరిని దగ్గర్లో ఉన్న వెల్లింగ్టన్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బిపిన్ రావత్ సతీమణి మృతి చెందినట్టు అనధికారికంగా తెలుస్తోంది. బిపిన్ రావత్ బతికే ఉన్నారని..అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందింది ఎవరు..గాయాలు ఎవరికయ్యాయి అనేది తెలియాల్సి ఉంది.