హెలికాప్టర్ లో ఆవు

హెలికాప్టర్ లో ఆవు

0
84

కొంతమంది కన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం మనం చూస్తుంటాము… మాములుగా సాటిమనిషికి సాయం చేయని నేటి కాలంలో ఓ వ్యక్తి తాను పెంచుకున్న ఆవును ఏ విధంగా ప్రేమగా చేసుకున్నాడో ఇట్టే అర్థం అవుతుంది… ఆవుకు గాయం అయితే తల్లడిల్లిపోయిన ఓ రైతు పర్వత ప్రాంతాల నుంచి ఆ ఆవును తరలించడం కష్టమని భావించాడు…

దీంతో దానిని కష్టపెట్టడం ఇష్టంలేక గాయపడిన తనకు ఇష్టమైన ఆవును హెలికాప్టర్ సాయంతో డాక్టర్ల వద్ద చేర్చాడు… ఈ సంఘటన స్విట్జర్లాండ్ లో జరిగింది…అసలే గాయం బారిన ఆవును నడిపిస్తూ తీసుకువెళ్లడం కష్టమని భావించి ఒక హెలికాప్టర్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేశారు..

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…ఆవుపై రైతు చూపించిన ప్రేమను నెటిజన్స్ ప్రశంశలవర్షం కురిపిస్తున్నారు..