కరోనా మహమ్మారి మొత్తం మన దేశంలో దాని వ్యాప్తి అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది, ఈ సమయంలో జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి, అందుకే మన దేశంలో లాక్ డౌన్ విధించారు ప్రధాని మోదీ, అయితే బయటకు రావద్దు అని చెబుతున్నా కొందరు బయటకు వస్తున్నారు.
ఇక ఉదయం ఆరు నుంచి 10 గంటలకు కొన్ని స్టేట్స్ లో పర్మిషన్ ఉంది ..మరికొన్ని చోట్ల కేవలం ఆరు నుంచి 8 గంటల వరకు పర్మిషన్ ఉంది.. ఈ సమయంలో నిత్యవసర వస్తువులకి మాత్రమే సమయం ఇచ్చారు.. కాని కొందరు అవసరం లేకపోయినా బయటకు వస్తున్నారు.
అయితే దీనిని కూడా పలు చోట్ల తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాయి కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ , ఇక మాస్క్ లేకుండా బయటకు వస్తే ఫైన్, అలాగే ఉమ్మినా ఫైన్ వేస్తున్నారు తెలంగాణలో, ఇక తాజాగా ఒడిసాలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. నో మాస్క్ నో పెట్రోల్/డీజిల్/సీఎన్‌జీ
నిబంధన తీసుకువచ్చింది అక్కడ సర్కార్… ఒక వేళ మీరు బంక్ కు వెళ్లిన సమయంలో మాస్క్ లేకపోతే కచ్చితంగా మీకు పెట్రోల్ పోయరట.