హ‌లో విమానం టికెట్స్ బుక్ చేసుకుంటున్నారా ఆగండి

హ‌లో విమానం టికెట్స్ బుక్ చేసుకుంటున్నారా ఆగండి

0
80

దేశంలో లాక్ డౌన్ అమ‌లు అవుతోంది, ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌ట‌కు అడుగుపెట్ట‌లేని స్దితి.. ఎక్క‌డ వారు అక్క‌డే ఉండిపోయారు, అయితే లాక్ డౌన్ వేళ విమానాలు రైళ్లు బ‌స్సులు ర‌వాణా కూడా లేదు ఎక్క‌డిక‌క్క‌డ అంద‌రూ ఉండిపోయారు.

అయితే మే 7 వ‌ర‌కూ తెలంగాణ‌లో లాక్ డౌన్ పొడిగించారు‌, మ‌రి ఏపీలో కూడా కేంద్రం ఇచ్చిన స‌డ‌లింపులు గ్రీన్ జోన్ ఏరియాల్లో నేటి నుంచి అమ‌లు చేస్తున్నారు, ఈ స‌మ‌యంలో కేంద్రం మే 3 వ‌ర‌కూ లాక్ డౌన్ విధించింది.

అయితే విమాన‌యాన సంస్ధ‌లు మే 4 నుంచి విమానాలు ర‌న్ చేసేందుకు టికెట్స్ ఓపెన్ చేశాయి, కొన్ని సంస్ధ‌లు డొమిస్టిట‌క్ స‌ర్వీసెస్ కు సిద్దం అయ్యాయి. దీంతో ఎయిర్ లైన్స్ సంస్థల ఆశలకు డీజీసీఏ కళ్లెం వేసింది. తాము మళ్లీ ప్రకటన చేసేంతవరకు టికెట్ల బుకింగ్ లు నిలిపివేయాలని ఆదేశించింది, ఇక విమానాలు తిప్పాలి అంటే దానికి క‌చ్చితంగా తాము ప్ర‌క‌టన ఇస్తాం కేంద్రం నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ ఎలాంటి బుకింగ్స్ చేసుకోవ‌ద్దు అని తెలిపింది కేంద్రం.