భారతీయ జనతా పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆపార్టీ నుంచి కీలక మహిళా నేత గుడ్ బై చెప్పనున్నారు… 2024 ఎన్నికల నాటికల్లా దేశ వ్యాప్తంగా కమలం పార్టీ జెండా ఎగరాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది…
రాజకీయంగా పలుకు బడి ఉన్న నేతలను అలాగే సినీ స్టార్లను బీజేపీలో లాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ప్రముఖ నటి ఎంపీ హేమమాలిని బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు… ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు…
తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… తాను తన కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటున్నానని అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు…