హేమంత్ పరువు హత్య కేసులో మరో సంచలన విషయం బయటపడింది… 2020 జూన్ లో తమకు తెలియకుండా హేమంత్ ను అవంతి పెళ్లి చేసుకుందని దీంతో హేమంత్ ను ఏలాగైనా చంపి అవంతికి మళ్లి వివాహం చేయాలని ఆమె తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి అరుణా రెడ్డి అంగీకరించారు…
- Advertisement -
అందులో భాగంగా నెలరోజుల క్రితం తమ బంధువులందరిని పిలిచి హత్యకు ప్లాన్ చేశామని అన్నారు… అందులో భాగంగా నిన్న మధ్యాహ్నం ఎన్జీవో కాలనీలో వారిద్దరిని బలవంతంగా కారులో తీసుకువెళ్లామని ఒప్పుకున్నారు…
ఈ క్రమంలో వారు పారిపోయే ప్రయత్నం చేయటంతో యుగందర్ రెడ్డి హేమంత్ ను కారులో బలవంతంగా తీసుకువెళ్లి హత్య చేశాడని అవంతి తల్లి దండ్రులు వెళ్లడించారు…