అందుకే గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు: మంత్రి హరీష్ రావు క్లారిటీ

Hence the budget meetings without the Governor's speech: Minister Harish Rao Clarity

0
92

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని పెట్టకపోవడంపై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశంపై మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..మహిళ అయినందుకే గవర్నర్ ను బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానించలేదని బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం. ప్రధాని మోడీ పీఎం కాగానే గుజరాత్ గవర్నర్ కమల బెణి వాల్ ను డిస్మిస్ చేశారు.

అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ ఇటీవలే అందరూ మాతృ మూర్తులను అవమానించారు. భేటి బచావో భేటీ పడావో నిధుల్లో 80 శాతం మోడీ ప్రచారానికి ఖర్చు పెట్టారని పార్లమెంటు స్థాయి సంఘం చెప్పింది. ఎవరు మహిళలను అవమానపరుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహిళ కాదా.. ఆమెను అక్కడి గవర్నర్ ఎందుకు అవమాన పరుస్తున్నారు. రాజ్ భవన్ కు బీజేపీ వాళ్ళు ఎందుకు కాషాయ రంగు పులుముతున్నారు. గవర్నర్ ను రాజకీయాల్లోకి లాగుతున్నది బీజేపీ నేతలు. ఏదైనా ఉంటే శాసన సభా సచివాలయం, రాజభవన్ లు చేసుకుంటాయి. అవగాహన లేకనే బీజేపీ నేతలు కోర్టుకు వెళతాం అంటున్నారు. శాసనసభకు ఉన్న హక్కులు బండి సంజయ్ కు తెలియవా. గవర్నర్ వ్యవస్థ పై కేసీఆర్ కు గౌరవం ఉంది. గతంలో గవర్నర్ నరసింహన్ ను ఇపుడు తమిళ్ సైని గౌరవిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంది దారి చూపే కాగడా..బీజేపీ ది వెలుగు నివ్వని దీపం. బండి సంజయ్ ఓ సారి రాజ్యాంగాన్ని చదువుకోవాలి.

బండి సంజయ్ మీద ఆ పార్టీ లోనే అసమ్మతి ఉంది. రాజ్యాంగం మీద గవర్నర్ వ్యవస్థ మీద కేసీఆర్ కు గౌరవం ఉంది. గవర్నర్ వ్యవస్థ ను అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజలకు తెలుసు. బలం లేకున్నా అర్ధరాత్రి సీఎం లతో ప్రమాణాలు చేయించిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది. చిన్న చిన్న విషయాలకు రాద్ధాంతం సరికాదు. ప్రొరోగ్ కాలేదు కనుకే గవర్నర్ ను పిలువ లేదు. దేశ భక్తి గురించి మాకు బీజేపీ చెప్ప నవసరం లేదు. పీఎం మోడీ పాకిస్థాన్ కు వెళ్లి ఎవరి విందు స్వీకరించారో అందరికీ తెలుసు. రాజకీయ రంగు పులిమితే అది బీజేపీకే తగులుతుంది. మాతృ మూర్తులను అవమానించిన బీజేపీకి మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని మంత్రి హరీష్ రావు