అందుకే చంద్రబాబు పన్నాగం: ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

Hence the Chandrababu conspiracy: MLA Kakani Govardhan Reddy

0
85

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిందిస్తూ..తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిందించేందుకు ప్రోత్సహించడం, ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి చంద్రబాబు పన్నాగం పన్నుతున్నాడు.

ఆంధ్ర రాష్ట్రంలో యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారంటూ, తెలుగుదేశం నాయకులు ప్రచారానికి పూనుకోవడం నీచాతి నీచం. చంద్రబాబు కుమారుడు లోకేష్ మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడంటే, చంద్రబాబు తట్టుకోగలడా. చంద్రబాబు తెలుగుదేశం నాయకుల వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రంలోని తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలని, ఒళ్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని చంద్రబాబును, తెలుగుదేశం నాయకులను హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు తక్షణమే పట్టాభి లాంటి నీచుడు చేసిన దురదృష్టకర వ్యాఖ్యలకు స్పందించి, క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు.