క్యాన్సర్ రోగులకు హీరో బాలకృష్ణ గుడ్ న్యూస్

0
84

21 బెడ్స్‌తో బసవతారకం ఆసుపత్రిలో డేకేర్‌ వార్డ్‌ను ఆ ఆసుపత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. 100 పడకలతో మొదలైన బసవతారకం ఆసుపత్రి నేడు 650 పడకలకు వృద్ది చెందింది. సాధ్యమైనంత వరకు రోగు ఆర్ధిక స్థోమతతో సంబంధం లేకుండా చికిత్సను అందిస్తున్నారు.

తాజాగాప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు ఉచిత కన్సల్టేషన్ కల్పించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రేడియాలజీ, న్యూక్లియస్ మెడిసిన్ తదితర విభాగాల్లో వ్యాధి నిర్ధారణ చేయించుకునే వారికి 20% తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ సూచించారు.