75 ఏళ్ల క్రితం జరిగిన విషాదకరమైన ఘటన, జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు
వదిలింది అమెరికా ..రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై ఇలా అణుబాంబు వదలడంతో ప్రపంచం మొత్తం బాధపడింది.
1945 జూలై 16న అమెరికా మాన్హాట్టన్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన తొలి అణుబాంబును విజయవంతంగా పరీక్షించింది. లొంగిపోవాలి అని భావిస్తున్న జపాన్ పై అణుబాంబు ప్రయోగించారు,
శాంతికి జపాన్ రాజు నిరాకరించడం.. యుద్ధంలో తమ సైనికుల మరణాలను తగ్గించేందుకు అణుబాంబులు ప్రయోగించడం మేలని అమెరికా భావించింది.
అయితే అసలు ముందు హిరోషిమా నాగసాకిలపై కాకుండా మరికొన్ని నగరాలను ఎంచుకున్నారట, ఇప్పటి వారికి అవి తెలియకపోవచ్చు కాని పలు కారణాల వల్ల ఆ నగరాలపై బాంబులు ప్రయోగించలేదు.
కోకురా, హిరోషిమా, యుకోహామా, నీగటా, క్యోటో నగరాలపై బాంబులు వేయాలన్నది అగ్రరాజ్యం ప్లాన్.
అయితే ఎందుకు ఇలా ఈ నగరాలపై టార్గెట్ చేశారు, అంటే జపాన్ మిలటరీ కేంద్రంగా ఉంది హిరోషిమా
నౌకాశ్రయ నగరంగా నాగసాకి ఉంది. అది వీరి టార్గెట్. ఎక్కువ నష్టం ఈ ప్రాంతంలో జరుగుతుంది అని టార్గెట్ చేశారట.