ఫ్లాష్..ఫ్లాష్- గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

High Court gives green signal to open Gurukuls

0
93
Telangana

తెలంగాణలోని గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గురుకులాలు తెరవొద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి కోరింది. విద్యా సంస్థల్లో కొవిడ్ జాగ్రత్తలు తీసుకున్నామని ఏజీ ప్రసాద్ తెలిపారు. గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్‌లైన్ బోధన చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో 2021-22 ఏడాది నుంచి సగం సీట్లను స్థానిక నియోజకవర్గాల పరిధిలోని పిల్లలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.