Flash News- బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

0
76
Telangana

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. గతేడాది నుంచి రెండు విడతలు పాదయాత్ర పూర్తి చేసిన సంజయ్‌…ఈ నెల 2న యాదాద్రి ఆలయం నుంచి మూడో విడత ప్రారంభించి 15వ తేదీన జనగామ జిల్లాకు చేరుకున్నారు.

కానీ జనగామలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. దీనితో ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేకులు పడ్డాయి. అయితే తాజాగా బండి సంజయ్‌ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని న్యాయస్థానం సస్పెండ్ చేసింది.