హుజురాబాద్ లో ఫ్లెక్సీ వార్..టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

0
93

తెలంగాణాలో రాజకీయాల హీట్ తారాస్థాయికి చేరింది. హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సంచలనం రేపుతోంది. ఈనెల 5న (ఈరోజు) హుజురాబాద్ లో జరిగిన అభివృద్దితో పాటు నీ అవినీతి, అక్రమ ఆస్తులపై చర్చకు కౌశిక్ రెడ్డి సిద్దంగా వున్నాడు… నువ్వు కూడా సిద్దమా? అంటూ భారీ హోర్డింగ్ దర్శనమిచ్చింది.

దీనితో నేడు హుజురాబాద్ లోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద హైటెన్షన్ నెలకొంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు పరస్పర దాడులు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ సంఘటనలో ఇరు పార్టీల నాయకులను అదుపు చేసేందుకు ప్రయత్నించిన సీఐ శ్రీనివాస్‌కు ముఖంపై గాయం అయింది.

హుజురాబాద్ లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. ఈ కుట్రలో భాగం పంచుకోవద్దని తాము తలుచుకుంటే పొలిమేర దాకా తరిమి కొట్టే శక్తి తమకే ఉందని చిల్లర మాటలు నమ్మవద్దని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు.