హిజాబ్ వివాదం..ట్విట్టర్ లో ఎమ్మెల్సీ కవిత పోస్ట్ వైరల్

Hijab controversy..Emlsi poem post viral on Twitter

0
90

మహిళల వస్త్రధారణ విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టికర్తలు వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ సందర్బంగా తాను చేతితో రాసిన కవితను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు …హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ అవుతుందన్నారు. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? ఏం చేయాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలన్నారు. స్త్రీలు సృష్టికర్తలు అన్న కవిత…వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ సందర్బంగా తాను రాసిన కవితను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు..

హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్..
మతమేదైనా సరే…
మనమంతా భారతీయులమే..
సిందూర్-టర్బన్-హిజాబ్-క్రాస్
ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే…
“త్రివర్ణ పతాకాన్ని” రూపొందించిన పింగళి వెంకయ్య అయినా..
“జై హింద్” అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా..
“సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ ” అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా..
“జన గణ మన” తో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా..
మనకు చెప్పింది ఒక్కటే..
మనం ఎవరైనా… మనమంతా భారతీయులమనే.. !!