Flash: హిజాబ్ వివాదం..కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

0
86

కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం చిలికిచిలికి గాలి వానలా మారింది. విద్యార్థులు మతపరమైన వేషధారణతో కళాశాలకు రావద్దని హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. 14వ తేదీ నుంచి కళాశాలలను, స్కూళ్లు ఓపెన్ చేసుకోవచ్చని.. ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఉద్రిక్త పరిస్థితుల మధ్య కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 19 తేదీ సాయంత్రం వరకు ఉడిపి జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది కర్ణాటక సర్కార్.

ఏమిటీ హిజాబ్‌ వివాదం

ఓ వర్గం విద్యార్థినిలు హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకాగా .. మరో వర్గం విద్యార్థులు అభ్యంతరం తెలుపుతూ.. కాషాయ కండువాలతో కళాశాలకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి