యువకులని హిజ్రాలు ఆపారు వారి పేరెంట్స్ స్ధానికులు వచ్చి ఏం చేశారంటే

యువకులని హిజ్రాలు ఆపారు వారి పేరెంట్స్ స్ధానికులు వచ్చి ఏం చేశారంటే

0
91

హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలలో హిజ్రాలపై కంప్లైంట్స్ ఇస్తున్నారు స్ధానికులు …సాయంత్రం పూట యువకులని తప్పుదోవ పట్టిస్తున్నారు అని ఈ మధ్య కంప్లైంట్ వస్తున్నాయట. తాజాగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్పల్లి వద్ద అర్ధరాత్రి కొంత మంది ట్రాన్స్ జెండర్లు హల్ చల్ చేశారు అని తెలుస్తోంది.

రాత్రి 12 తర్వాత అక్కడ స్దానికులకు హిజ్రాలకు మధ్య వివాదం జరిగింది, ఇక్కడ రోడ్లపై వెళ్లేవారిని ఈ ట్రాన్స్ జెండర్స్ తప్పుదోవ పట్టిస్తున్నారు అని కొందరు పేరెంట్స్ కూడా వారిని ఆపి ప్రశ్నించారు. ఇక్కడ మీరు తిరగద్దు అని వారితో వివాదం పెట్టుకున్నారు, ఈ సమయంలో పోలీసులు రంగంలోకి వచ్చారు.

పోలీసులు కలగజేసుకొని వివాదాన్ని పరిష్కరించారు. మరోసారి ఆ ప్రాంతానికి రాబోమని ట్రాన్స్ జెండర్లు కాగితంపై రాసి ఇచ్చారు. ఇలా జాతీయ రహదారులపై కొందరు హిజ్రాలు ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు అని వారిని నిలువరించాలి అని స్ధానికులు కోరుతున్నారు, దీనిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేస్తాము అని తెలిపారు.