ఓ హిందూ యువతి పాకిస్థాన్లో రికార్డులకెక్కింది. పాకిస్థాన్ లో పోలీస్ ఉద్యోగం సాధించిన తొలి హిందూ యువతిగా చరిత్ర సష్టించింది. పుష్పా కొల్హి అనే హిందూ యువతి ఇటీవల సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఏఎస్సైగా ఎంపికైంది. ఆమెకు సింధ్ ప్రావిన్స్లో పోస్టింగ్ ఇచ్చినట్టు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.
మానవ హక్కుల కార్యకర్త కపిల్ దేవ్ ఈ విషయాన్ని తన ట్వీట్టర్ ఖాత ద్వారా తెలిపారు. పాక్‌లో పోలీస్ ఉద్యోగం సాధించిన తొలి హిందూ యువతిగా పుష్ప రికార్డులకెక్కారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది జనవరిలో సుమన్ పవన్ బోదాని అనే హిందూ మహిళ సివిల్ మేజిస్ట్రేట్గా నియమితులై సంచలనం సృష్టించింది. ఇప్పుడు పుష్ప పోలీస్ అధికారిగా ఎంపికయి మరో సంచలనం సృష్టించింది.