మనకి చైనాకి ఎన్నో విభేదాలు ఉన్నాయి, కొన్ని విషయాలలో పోటీ కూడా ఉంటుంది, అయితే చైనా భారత్ మధ్య ఎలాంటి డిఫరెన్స్ ఉన్నా ఓ విషయంలో మాత్రం చైనా చేసే పని అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఓ భారతీయ సంతతి వైద్యుడికి చైనా ప్రభుత్వం నివాళులు అర్పించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. అదేమిటి అక్కడ వైద్యులు ఉంటారు కదా మన వైద్యుడికి ఇలా నివాళి ఏమిటి అని అనుమానం రావచ్చు.
నిజమే కనిపించే దేవుడు ఆ వైద్యులు అంటాం, అలాగే ఆ వైద్యుడికి ఓ చరిత్ర ఉంది…వైద్యుడు ద్వారకానాథ్ కోట్నిస్కి 110 వ జయంతి సందర్భంగా చైనా ప్రభుత్వం నివాళులు అర్పించింది. అంతేకాదు అక్కడి విద్యార్థులు ద్వారకానాథ్పై డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. మరి ఇలా ఎందుకు అంటే దాని స్టోరీ చూద్దాం.
1938లో చైనా, జపాన్ల మధ్య జరిగిన రెండో యుద్ధం సమయంలో.. చైనా సైనికులకు సాయం అందించేందుకు భారత్ నుంచి ఐదుగురు వైద్యుల బృందం అక్కడకు వెళ్లింది. యుద్దం సమయంలో ఈ వైద్యులు వారికి ఎంతో సేవ చేశారు, చివరకు యుద్దం ముగిసిపోయింది, మిగిలిన నలుగురు వైద్యులు భారత్ వచ్చారు, కాని ద్వారకానాథ్ కోట్నిస్ చైనాలోనే ఉండిపోయి, తరువాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. మావో చేపట్టిన చైనా ఉద్యమంలోనూ ఆయన పాలు పంచుకున్నారు.
ఇక 1942లో 35 ఏళ్ల వయసులో కోట్నిస్ అక్కడే మరణించారు. అందుకే ఆయనని ఇప్పటికీ చైనా ప్రభుత్వం మర్చిపోదు. ఆయన సేవలు ఎవరూ మర్చిపోరు,చైనా ప్రజలు అధికారులు కోరడంతో ఆయన అక్కడే చివరి వరకూ ఉండిపోయారు. అలాగే వైద్య సేవలు చివరి వరకూ అందించారు.