ఇళ్లను అద్దెకు తీసుకునేవారికి, ఇళ్లను అద్దెకు ఇచ్చేవారికి కూడా ప్రయోజనాలు ఉండాలి అనేది తెలిసిందే, అయితే పాత చట్టానికి కొన్ని కొత్త సంస్కరణలతో కొత్త ముసాయిదాని కేంద్రం సిద్దం చేస్తోంది..అక్టోబర్ 31 వరకూ సమయం ఇచ్చి రాష్ట్రాల అభిప్రాయాలు తెలియచేయాలి అని కేంద్రం కోరింది, అయితే దేశంలో చాలా మంది ఇప్పుడు అద్దెకు ఇళ్లు తీసుకుంటున్నారు, ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉద్యోగ వ్యాపారానికి వెళ్లేవారు ఇలా తీసుకుంటున్నారు.
అయితే కొన్నిచోట్ల ఎన్నో ఫెసిలీటీలు ఉన్నా అద్దె తక్కువ ఉంటోంది, మరికొన్ని చోట్ల ఫెసిలీటీలు తక్కువ ఉన్నా అద్దె ఎక్కువ ఉంటోంది, దీంతో యజమానులు కాస్త నిరూత్సాహంగా ఉన్నారు, అందుకే కేంద్రం కొత్త ముసాయిదా సిద్దం చేసింది.
1 ఇక ఇళ్లు అద్దెకు తీసుకుంటే ఓనర్, టెనెంట్ మధ్య పరస్పర రాతపూర్వక అంగీకారం తప్పనిసరి.
2. ఏదైనా వివాదం వస్తే ఫాస్ట్ ట్రాక్ క్వాసీ జ్యుడీషియల్ మెకానిజం ఉంటుంది
3. ఇంటికి రెండు నెలలు, వాణిజ్యానికి షాపులకి కమర్షియల్ ప్లేస్ లకి ఆరునెలల అడ్వాన్ తీసుకోవచ్చు, ఇది మించకూడదు
4.అద్దె చెల్లించడంలో విఫలమైతే, టెనెంట్, తదుపరి వడ్డీతో సహా అద్దెను చెల్లించాల్సి వుంటుంది.
5. ఒకవేళ ముందు ఇళ్లు ఖాళీ చేస్తాను అనిచెప్పి చేయకుండా ఉంటే మొదటి రెండు నెలల అద్దె రెట్టింపవుతుంది.
ఆపై నెలకు నాలుగు రెట్ల అద్దెను చెల్లించాల్సి వస్తుంది.