హనీమూన్ కు వెళ్లుదామన్న భార్య- నో చెప్పిన భర్త ,చివరకు ఏం చేసిందంటే ?

Honey moon canceled wife Suicide

0
151

అసలే బయట పరిస్దితులు బాగాలేదు. ఈ సమయంలో కొత్తగా వివాహం అయిన ఆ జంట ఎంతో జాగ్రత్తగా ఉండాలి..కాని ఆ పెళ్లి కుమార్తె తనని హనీమూన్ కి తీసుకువెళ్లమని భర్తని కోరింది. గుజరాత్లోని సూరత్ నగరంలో దేవ 25 రోజుల క్రితం రాయ్బరేలీకి చెందిన రూపా అనే యువతిని వివాహం చేసుకున్నాడు.

పెళ్లి జరిగిన కొద్ది రోజులకు దేవేంద్రతో భార్య హనీమూన్కు వెళ్దామని అడిగింది. అయితే ఇందుకు అతను నో చెప్పాడు.. అసలే కరోనా అలాగే ఆర్దిక పరిస్దితి కూడా ఇప్పుడు బాగాలేదు అని చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య ఈ విషయం పై గొడవ జరిగింది.

తర్వాత ఆమె రూమ్ లోకి వెళ్లిపడుకుంది, ఓ గంట తర్వాత భర్త ఆమె దగ్గరకు వెళ్లిచూశాడు. ఆమె తలుపు తీయలేదు కిటికి నుంచి చూస్తే ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. తనని హనీమూన్ కు తీసుకువెళ్లమంది ఈ విషయంలో కాస్త వివాదం అయింది అంతే అని భర్త సమాధానం ఇచ్చాడు, పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.