ఆస్పత్రిలో కరోనా సోకిన వారికి అందించే ఆహరం ఇదే మతిపోతుంది

ఆస్పత్రిలో కరోనా సోకిన వారికి అందించే ఆహరం ఇదే మతిపోతుంది

0
86

కరోనా వైరస్ పేరు చెబితే ఇప్పుడు అందరూ వణికి పోతున్నారు, అయితే దేశ వ్యాప్తంగా 151 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, దీంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.. ఎక్కడికక్కడ ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా తగు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు.

వందలాది మంది ప్రజలు వివిధ ఆసుపత్రల్లో ఐసోలేషన్ వార్డుల్లో చేరుతున్నారు. వైరస్ సోకిన బాధితులతో పాటు ఆ లక్షణాలతో పరీక్షలు చేయించుకొని ఫలితాల కోసం వేచిచూస్తున్న వారి ఐసోలేషన్ వార్డుల్లో ఉంచుతున్నారు. మరి వీరు ఎలాంటి ఆహరం తీసుకోవాలి వారికి డాక్టర్లు ఏం ఆహరం ఇస్తున్నారో తెలుసా.

తాజాగా కేరళ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది.

భారతీయులకు అందిస్తున్న మెనూలో . బ్రేక్ఫాస్ట్లో దోశ, సాంబార్
రెండు ఉడకబెట్టిన గుడ్లు
ఆరెంజ్ పండ్లు, టీ అందజేస్తున్నారు.
ఉదయం 10.30 గంటల సమయంలో పండ్ల రసం
మధ్యాహ్న భోజనంలో చపాతీలు, కేరళ మీల్స్ పాటు చేపల ఫ్రై, మినరల్ వాటర్ ఉన్నాయి.
సాయంత్రం మూడు గంటల సమయంలో టీతో పాటు బిస్కెట్లు అందజేస్తున్నారు.
ఇక, రాత్రి భోజనంలో అన్నంతో పాటు రెండు అరటి పండ్లు ఇస్తున్నారు.

విదేశీలకు
బ్రేక్ఫాస్ట్లో సూప్, పండ్లు, రెండు గుడ్లు
పైనాపిల్ జ్యూస్లం
లంచ్లో టోస్టెడ్ బ్రెడ్, ఛీస్తో పాటు కొన్ని పండ్లు
టీకి బదులు పండ్ల రసం
రాత్రి భోజనంలో టోస్టెడ్ బ్రేడ్,
గిలకొట్టిన గుడ్లు (స్క్రాంబ్లుడ్ ఎగ్స్) పండ్లు
వీరు అందరికి వార్త పత్రికలు చదివే పుస్తకాలు ఇస్తున్నారు.