హాస్టల్ విద్యార్దుల‌కి షాక్ ఇక్క‌డే ఉండాలి ఆ ప‌త్రాలు ప‌ని చేయ‌వు

హాస్టల్ విద్యార్దుల‌కి షాక్ ఇక్క‌డే ఉండాలి ఆ ప‌త్రాలు ప‌ని చేయ‌వు

0
104

ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు ఇచ్చే ప‌త్రం తీసుకుని ఊరు వెళ్లిపోవ‌చ్చు అనుకున్నారు, కాని సీన్ మారింది తెలంగాణ పోలీస్ బాస్ దానికి స‌సేమీరా అన్నారు, ఆ ప‌త్రాలు ప‌నికిరావు దానికి అనుమ‌తి లేదు అని తెలిపారు, దీంతో హ‌స్ట‌ల్ లో ఉంటున్న వారి ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి.

అమీర్‌పేట, పంజాగుట్టలోని హాస్టళ్లలో ఉంటున్న యువతీయువకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి షాకిచ్చారు. దాదాపు వేలాది మంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని త‌మ ఊరు వెళ్లేందుకు ఎన్ వోసీ తీసుకున్నారు, కాని దీనిపై డీజీపీ సీరియ‌స్ అయ్యారు.

ఇలాంటి ప‌త్రాలు ప‌ని చేయ‌వు అని ఎక్క‌డ వారు అక్క‌డే ఉండాలి అన్నారు ..హ‌స్ట‌ల్లు ఎక్క‌డా క్లోజ్ చేయ‌ము అని అంద‌రూ హ‌స్ట‌ల్లో ఉండ‌వ‌చ్చు అని తెలిపారు.. మ‌రో ప‌క్క ఈ ప‌త్రాలు తీసుకువ‌చ్చినా ఏపీ పోలీసులు కూడా తాము అనుమ‌తించ‌ము అని చెబుతున్నారు.